ఉరవకొండ పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేఖరుల సమావేశంలో వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు వై. విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, కూటమి సర్కారు వైఫల్యం వల్లే శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది భక్తులు మరణించారని ఆరోపించారు. ఆలయం దేవదాయ శాఖ పరిధిలోకి రాదని మంత్రి మాట్లాడటం దారుణమని, సింహాచలం, తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలను మరువకముందే ఇలా జరగడం కలచివేస్తోందని అన్నారు.