కూడేరు పట్టణంలో నెల రోజులుగా అపరిశుభ్రంగా తిరుగుతున్న మతిస్థిమితం లేని వ్యక్తికి ఉరవకొండ నియోజకవర్గ టీడీపీ నాయిబ్రహ్మణుల సంఘం అధ్యక్షుడు నాగరాజు, ఆమిద్యాల రాములు ఆదివారం సహాయం చేశారు. వారు అతనికి జట్టు తొలగించి, స్నానం చేయించి, మంచి దుస్తులు వేశారు. ఈ మానవతా దృక్పథాన్ని పట్టణ ప్రజలు అభినందించారు.