ఉరవకొండ: ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చిన తల్లి

2చూసినవారు
ఉరవకొండ: ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చిన తల్లి
అనంతపురం జిల్లా బ్రహ్మనముద్రం మండలం నంజాపురం గ్రామానికి చెందిన కవిత, రమేష్ దంపతులకు కొడుకు కావాలనే ఆశతో చేసిన ప్రయత్నంలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. బుధవారం అనంతపురం సర్వజన వైద్యశాలలో కవితకు ఒకే కాన్పులో ఇద్దరు కొడుకులు, ఒక కూతురు జన్మించారు. గతంలో వారికి నలుగురు కూతుళ్లు ఉండగా, ఈసారి ముగ్గురు పిల్లలు జన్మించడం విశేషం. సంక్లిష్టమైన సిజేరియన్ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేయగా, తల్లి, ముగ్గురు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు. ఈ ఘటన వైద్య వర్గాల్లోనూ, స్థానికంగానూ చర్చనీయాంశమైంది.

ట్యాగ్స్ :