కూడేరు మండలం పెన్నహో బిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) బ్యాక్వాటర్ కారణంగా వంట పొలాలు మునిగిపోయాయి. భూములకు పరిహారం అందక, అప్పులు చేసి సాగు చేసిన పంటలు నీటిలో కొట్టుకుపోవడంతో రైతులు సర్వం కోల్పోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని ఆదివారం తెలిపారు. 11,100 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఈ డ్యాంలో లీకేజీల వల్ల పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయలేకపోతున్నారు. దీనితో దానిమ్మ, గుమ్మడి, టమోటా, కంది, ఆముదం, వరి, చీనీ, వేరుశనగ వంటి పంటలు నీట మునిగిపోయాయి.