ఉరవకొండ: వైభవంగా పాండురంగ స్వామి కళ్యాణం

12చూసినవారు
ఉరవకొండ: వైభవంగా పాండురంగ స్వామి కళ్యాణం
బెళుగుప్ప మండలంలోని శ్రీరంగాపురంలో ఆదివారం శ్రీదేవి భూదేవి సమేత పాండురంగస్వామి కల్యాణం వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య వేలాదిమంది భక్తుల సమక్షంలో కన్నుల పండువగా జరిగింది. రెండు రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు అర్చకులు శంకరప్ప శర్మ తెలిపారు. కల్యాణం అనంతరం స్వామి ఉత్సవ విగ్రహాలను రథంపై ఊరేగించారు. ఈ వేడుకను దర్శించుకోవడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్