ఉరవకొండ: డొనేకల్లులో తాగునీటిసమస్యతో ఇబ్బందులుపడుతున్న ప్రజలు

8చూసినవారు
ఉరవకొండ: డొనేకల్లులో తాగునీటిసమస్యతో ఇబ్బందులుపడుతున్న ప్రజలు
విడపనకల్లు మండలంలోని దొనేకల్లు గ్రామంలో తీవ్ర తాగునీటి సమస్య నెలకొంది. నెల క్రితం నీటి సరఫరా చేసే నాలుగు మోటార్లు కాలిపోవడంతో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. స్థానిక పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికీ మోటార్లు మరమ్మత్తు చేయకపోవడంతో సుమారు మూడు వేల మంది గ్రామస్తులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్తులు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం, కిలోమీటరు దూరంలో ఉన్న బోరు బావి నుంచి నీటిని తెచ్చుకోవడానికి తోపుడు బండ్లు, ద్విచక్ర వాహనాలను ఉపయోగిస్తున్నారు.