వజ్రకరూరు మండలంలోని వెంకటాంపల్లి జడ్పీ హైస్కూల్ లో ఎన్ఎస్ టీచర్ సుధాకర్ విద్యార్థులతో వికృతంగా ప్రవర్తిస్తున్నాడని తల్లిదండ్రులు మంగళవారం పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని ఇన్చార్జ్ హెచ్ఎం జగదీష్ కు విన్నవించారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ పాఠశాలకు చేరుకుని విద్యార్థులను విచారించి, నివేదికను జిల్లా విద్యాశాధికారులకు పంపుతున్నట్లు తెలిపారు.