ఖరీఫ్ లో సాగు చేసిన వరి, పత్తి పంటలను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం నాయకులు మంగళవారం ఉరవకొండలో ఆందోళన చేపట్టారు. ప్రైవేట్ వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి ధరలు తగ్గిస్తున్నారని, దీంతో రైతులు నష్టపోతున్నారని వారు ఆరోపించారు. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి, డీటి భోగన్న గౌడ్ కు వినతి పత్రాన్ని అందజేశారు.