ఉరవకొండ: ఆ భూములు మాకే ఇవ్వాలంటూ వినతి

5చూసినవారు
ఉరవకొండ: ఆ భూములు మాకే ఇవ్వాలంటూ వినతి
విడపనకల్లు మండలంలోని అంచనహాలు గ్రామానికి చెందిన 70 మంది రైతులు శుక్రవారం డిప్యూటి తహసీల్దారు చంద్రశేఖర్ రావుకు వినతి పత్రం అందించారు. తమకు 50 ఏళ్ల క్రితం, 1970లో ల్యాండ్ సీలింగ్ పథకం కింద పట్టాలు మంజూరు చేసిన భూములు తమకే దక్కేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇటీవల జరిగిన రీసర్వే వల్ల కొందరు నాటి భూస్వాములు ఆ భూములు తమవేనని ఆర్డీఓ వద్దకు వెళ్లారని రైతులు వాపోయారు. ఆ భూముల్లో తాము సాగు చేసుకుంటున్నామని, బ్యాంక్ రుణాలు కూడా తెచ్చుకున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్