ఉరవకొండ: నిరుపయోగంగా సచివాలయ భవనం

12చూసినవారు
ఉరవకొండ: నిరుపయోగంగా సచివాలయ భవనం
వజ్రకరూరు మండలం కొనకొండ్లలో రెండేళ్ల క్రితం రూ. 40 లక్షల వ్యయంతో నిర్మించిన సచివాలయ భవనం నేటికీ ప్రారంభానికి నోచుకోక నిరుపయోగంగా మారింది. ఆదివారం నాటికి కూడా ఈ నూతన భవనాన్ని ప్రారంభించకపోవడంతో, సిబ్బంది పాత భవనంలోనే విధులు నిర్వహిస్తున్నారు. దీనితో గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, సంబంధిత అధికారులు స్పందించి వెంటనే సచివాలయ భవనాన్ని ప్రారంభించాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్