విడపనకల్లు మండలంలోని ఆర్ కొట్టాల బీసీ కాలనీకి వెళ్లే సీసీ రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో వేసిన ఈ రోడ్లకు కాలువలు లేకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడిందని గ్రామస్తులు మంగళవారం తెలిపారు. రోడ్లు పాచిపట్టి దుర్వాసన వస్తున్నాయని, పలువురు జారిపడ్డారని బీసీ కాలనీవాసులు వాపోయారు. మురుగు కాలువలు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.