ఉరవకొండ నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మధుసూధన్ కోరారు. తాడిపత్రిని కరువు మండలంగా ప్రకటించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, మండల కార్యదర్శి రాజారామిరెడ్డి సోమవారం తహసీల్దార్ సోమశేఖర్ కు వినతిపత్రం అందించారు. పెద్దవడుగూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని రైతు సంఘం నాయకుడు దస్తగిరి తహసీల్దార్ ఉషారాణికి వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రాలు సమర్పించారు.