అనంతపురం: ఘోరం.. కళాశాలలో విద్యార్థిపై పడిన ఫ్యాన్

539చూసినవారు
అనంతపురం: ఘోరం.. కళాశాలలో విద్యార్థిపై పడిన ఫ్యాన్
ఉరవకొండ మండలం చిన్నముష్టురు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం జరిగిన ప్రమాదంలో విద్యార్థిని గాయపడింది. సీలింగ్ ఫ్యాన్ ఒక్కసారిగా విరిగి విద్యార్థినిపై పడడంతో సంఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డేటా ఎంట్రీ, కంప్యూటర్ తదితర కోర్సులకు సంబంధించి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆట్రైనింగ్ కు హాజరైన చంద్రకళ అనే విద్యార్థినిపై ఒక్కసారిగా ఫ్యాన్ విరిగిపడింది. దీంతో ఆవిద్యార్థిని గాయపడింది.

సంబంధిత పోస్ట్