గురువారం, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 'ఇంటింటికి మంత్రి' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉరవకొండ పట్టణంలో విస్తృతంగా పర్యటించి, ప్రజల ఇంటి వద్దకే వెళ్లి వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. బోయ వీధి, లాలు స్వామి గుడి, పాత బజారు, కామన్న కట్ట, కొండప్ప బావి, ముగా బసవన్న కట్ట వీధులలో పర్యటించి, అక్కడికక్కడే సమస్యల పరిష్కారానికి అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.