కూడేరు మండలం రామచంద్రపురంలో సంవత్సరాలుగా రోడ్డు, మురుగునీటి కాలువల సమస్యలు నెలకొన్నాయి. గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో అనంతపురం-బళ్లారి ప్రధాన రహదారి నుంచి రెండు కిలోమీటర్లు నడవాల్సి వస్తోంది. సీసీ రోడ్లు వేసినా మురుగు కాలువలు లేకపోవడంతో మురుగునీరు వీధుల్లోనే ప్రవహిస్తోంది. ఈ సమస్యలను పరిష్కరించాలని గ్రామస్థులు మంగళవారం పాలకులు, అధికారులను కోరారు.