విడపనకల్లు మండలంలోని పాలికి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బుధవారం తెలిపారు. గతంలో రోజుకు ఐదు ట్రిప్పులు తిరిగే బస్సును, ఆటోల ఆధిపత్యం, తక్కువ కలెక్షన్, రోడ్డు సరిగా లేకపోవడం వంటి కారణాలతో అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు, ముఖ్యంగా విద్యార్థులు ఉరవకొండ, గుంతకల్లుకు వెళ్లడానికి ఆటోలపై ఆధారపడాల్సి వస్తోంది. ఆటోలు పూర్తి అయితేనే కదులుతాయని, అత్యవసర పరిస్థితుల్లో అధిక మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి వస్తుందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.