ఉరవకొండ: కోటంక చెరువుకు నీటి విడుదల

4చూసినవారు
ఉరవకొండ: కోటంక చెరువుకు నీటి విడుదల
కూడేరు మండలంలోని రామచంద్రపురం గ్రామంలోని పొట్టిచెరువు నుంచి గార్లదిన్నె మండలం కోటంక, మర్తాడు గొలుసు చెరువులకు టీడీపీ నాయకులు, రైతులు బుధవారం నీటిని విడుదల చేశారు. నీటి విడుదల కోసం కృషి చేసిన పయ్యావుల సోదరుల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి పాలన సాగుతోందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంక జయరాం, మర్తాడు వెంకటేస్, మహేస్, ప్రభాకర్, విజేయుడు, డీలర్లు వెంకటేష్, బళ్లారి వెంకటేశులు, బంగి వెంకటప్ప పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్