కూడేరు పీఏబీఆర్ డ్యాం కుడికాలువ పనులు చివరి దశకు చేరుకున్నాయి. గతనెల 7న కాలువ తెగిపోవడంతో రూ. 92లక్షలతో సైడ్వాల్ నిర్మాణ పనులు చేపట్టారు. అవి దాదాపు పూర్తవడంతో బుధవారం 200 క్యూసెక్కుల నీటిని కాలువకు మళ్లించారు. రానురాను నీటిని మరింత పెంచుతామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం డ్యాంలో నీటిమట్టం 435.300 మీటర్లు, నీటి నిల్వ 5,099 టీఎంసీలుగా ఉందని ఏఈఈ లక్ష్మిదేవి తెలిపారు.