వజ్రకరూరు: పోక్సో కేసులో నిందితుడి అరెస్టు

3చూసినవారు
వజ్రకరూరు: పోక్సో కేసులో నిందితుడి అరెస్టు
వజ్రకరూరు మండలం ఎన్ఎన్ఎ్పతండాకు చెందిన వినోదక్కుమార్ నాయక్(22) అనే వ్యక్తిని పోక్సో కేసులో శుక్రవారం అరెస్టు చేశారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(17)ను ప్రేమ పేరుతో వంచించి గర్భవతిని చేసినట్లు ఎస్సై నాగస్వామి తెలిపారు. బాలిక ఈనెల 26న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తట్రకల్ గ్రామంలో నిందితుడిని గుర్తించి అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ శ్రీనివాసులు పేర్కొన్నారు.