పట్టణంలో మరో 25 ఏళ్లు తాగునీటి సమస్య లేకుండా చేస్తాం: మంత్రి

4చూసినవారు
పట్టణంలో మరో 25 ఏళ్లు తాగునీటి సమస్య లేకుండా చేస్తాం: మంత్రి
ఇంటింటికి మంత్రి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉరవకొండ పట్టణంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటించారు. అంబేద్కర్ నగర్, ఇందిరానగర్ వంటి కాలనీలలో ప్రజల ఇంటి వద్దకే వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని, వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉరవకొండ పట్టణంలో రాబోయే 25 ఏళ్ల పాటు తాగునీటి సమస్య లేకుండా చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్