జగన్ మాటలను ఎవరు నమ్మరు: మంత్రి

3చూసినవారు
ఏపీలోని పరిశ్రమలను తరిమేసిన జగన్ మాటలను ఎవరూ నమ్మరని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. గూగుల్ డేటా సెంటర్ను నాడు గోడౌన్ అని ఎగతాళి చేసి, నేడు తనదేనని ప్రచారం చేసుకోవడంపై ఆయన మండిపడ్డారు. క్రెడిట్ చోరీ జగన్ డీఎన్ఏలోనే ఉందని ధ్వజమెత్తారు. దాడులు చేస్తామనే బదులు, పరిశ్రమలను తెస్తామని చెప్పాలని ఆయన హితవు పలికారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్