డ్యామ్ లో మునిగి మహిళ, బాలిక మృతి

1చూసినవారు
శనివారం అనంతపురం అజాద్ నగర్ కు చెందిన 9 మంది కుటుంబసభ్యులు పీఏబీఆర్ డ్యామ్ సమీపంలో విహారయాత్రకు వెళ్లారు. కౌకుంట్ల గ్రామం చివర డ్యామ్ వద్ద ఆడుకుంటున్న సమయంలో షేక్ ఫరీదా (35), షేక్ యాస్మిన్ (13) ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి మునిగిపోయారు. ఈత రాకపోవడంతో ఇద్దరూ ఊపిరాడక మృతి చెందారు. మృతురాలి తల్లి షేక్ కుర్సీద్ భాను ఫిర్యాదు మేరకు ఉరవకొండ ఎస్సై జనార్ధన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్