తాడిపత్రిలోని భగత్ సింగ్ నగర్‌కు చెందిన జశ్వంత్ కుమార్ తేరన్నపల్లి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈతకు వెళ్లి వస్తుండగా రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఆదివారం పుట్టినరోజు జరుపుకోవాల్సిన సమయంలో జరిగిన ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.