
గుంటూరు జీజీహెచ్పై నుంచి దూకి కిడ్నీ రోగి ఆత్మహత్య
AP: కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న చెన్నంశెట్టి శ్రీనివాస్ అనే రోగి గుంటూరు జీజీహెచ్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 23న ఆసుపత్రిలో చేరిన శ్రీనివాస్, శనివారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి ఈ ఘోరానికి పాల్పడ్డాడు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి గ్రామానికి చెందిన శ్రీనివాస్ తాపీ మేస్త్రీగా పనిచేసేవాడని, అతని భార్య కొంతకాలం క్రితమే మరణించినట్లు సమాచారం.




