Jan 26, 2026, 17:01 IST/
ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మి స్కీమ్.. ఖాతాల్లోకి రూ.లక్ష
Jan 26, 2026, 17:01 IST
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలు దిశగా కదులుతోంది. ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం కల్యాణ లక్ష్మి పథకం కింద లక్ష రూపాయలు, 10 గ్రాముల బంగారం అందించే హామీపై ప్రభుత్వం దృష్టి సారించింది. అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం, రూ. లక్ష జమ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ పథకం కోసం బడ్జెట్లో రూ. 2,175 కోట్లు ప్రతిపాదించారు. ఇప్పటివరకు 65,026 మంది దరఖాస్తు చేసుకోగా, మరో 31,468 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.