Nov 09, 2025, 01:11 IST/
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి నేడే ఆఖరు
Nov 09, 2025, 01:11 IST
TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచార గడువు నేటితో ముగియనుంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు మైకులు, ప్రచార రథాలు బంద్ కానున్నాయి. ప్రచార గడువు ముగియనుండటంతో ఆయా పార్టీల నేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఇవాళ సా.6 నుంచి ఈ నెల 11 (పోలింగ్ తేదీ) సా.6 గంటల వరకు నియోజకవర్గంలో వైన్స్ మూసివేయాలని HYD సీపీ సజ్జనార్ ఆదేశించారు