Feb 17, 2026, 11:02 IST/ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి
పద్మాజీవాడ వద్ద జాతీయ రహదారిపై కారు దగ్ధం
Feb 17, 2026, 11:02 IST
మంగళవారం మధ్యాహ్నం ఎల్లారెడ్డి సెగ్మెంట్ సదాశివనగర్ మండలం పద్మాజీవాడి గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారి వంతెనపై రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు వెళుతున్న కారు అదుపుతప్పి కంటైనర్ వాహనాన్ని ఢీకొనడంతో కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. అయితే, కారులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఫైర్ సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేలోపు కారు పూర్తిగా కాలిపోయింది. ప్రమాదానికి గల కారణాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.