అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్: వైసీపీ

29చూసినవారు
అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్: వైసీపీ
AP: అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్ కొట్టుమిట్టాడుతోందని వైసీపీ వ్యాఖ్యానించింది. ప్రతి మంగళవారం ఇదే తంతు కొనసాగుతోందని మండిపడింది. శనివారం ఎక్స్ వేదికగా.. ‘వచ్చే మంగళవారంలోపు కొత్త బడ్జెట్ అప్పునకు ప్రభుత్వం సిద్ధమైంది. మరో రూ.4,400 కోట్ల భారం మోపేందుకు రెడీ అయింది. ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా నిధుల సమీకరణకు శుక్రవారం ఆర్బీఐ నోటిఫికేషన్ వెలువడింది. కూటమి ప్రభుత్వ ఆర్థిక విధానాలు రాష్ట్రాన్ని అప్పుల పాటు చేస్తున్నాయి’ అని వైసీపీ ట్వీట్ చేసింది.

సంబంధిత పోస్ట్