ఆంధ్రప్రదేశ్‌లో రాజ్‌భవన్ పేరును 'లోక్‌భవన్'గా మార్చారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా గవర్నర్ల అధికారిక నివాసాల పేర్లను 'లోక్ భవన్'గా మారుస్తున్న నేపథ్యంలో ఈ మార్పు జరిగింది. కేంద్ర హోంమంత్రిత్వశాఖ సమాచారం మేరకు, ఏపీ గవర్నర్ ఈ పేరు మార్పునకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది.