'ఆండ్రోపాజ్' ఎఫెక్ట్‌.. మగవారిలో తగ్గుతున్న సంతానోత్పత్తి సామర్థ్యం!

10830చూసినవారు
'ఆండ్రోపాజ్' ఎఫెక్ట్‌.. మగవారిలో తగ్గుతున్న సంతానోత్పత్తి సామర్థ్యం!
సంతానోత్పత్తి సమస్యలు కేవలం మహిళలకే పరిమితం కావని, పురుషుల్లోనూ వయసు పెరిగే కొద్దీ సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుందని, దాన్నే 'ఆండ్రోపాజ్' అంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. 'ఆండ్రోపాజ్' కారణంగా టెస్టోస్టెరాన్ స్థాయులు తగ్గి వీర్యకణాల సంఖ్య, కదలిక, నాణ్యతపై ప్రభావం పడుతుంది. దీంతో గర్భధారణ అవకాశాలు తగ్గడంతో పాటు గర్భస్రావం ప్రమాదం కూడా పెరగొచ్చు. ధూమపానం, మద్యపానం, స్థూలకాయం, ఒత్తిడి, మధుమేహం వంటి జీవనశైలి అంశాలు కూడా పురుషుల వంధ్యత్వానికి కారణమవుతాయి. సంతానోత్పత్తి సమస్యల్లో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పరీక్షలు చేయించుకుని వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్