దర్శకుడు విఘ్నేష్ శివన్ తన కెరీర్ కష్టకాలంలో సంగీత దర్శకుడు అనిరుధ్ చేసిన సాయాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. 'నానుమ్ రౌడీ దాన్' సినిమా షూటింగ్ కోసం పాండిచ్చేరి వెళ్లే సమయంలో తన దగ్గర కేవలం బస్సు ఛార్జీల కోసం రూ.250 మాత్రమే ఉన్నాయని, అప్పుడు అనిరుధ్ తన బ్యాగులో రహస్యంగా రూ.50,000 ఉంచి, బస్సులో ఉండగా మెసేజ్ చేశారని తెలిపారు. ఆ మెసేజ్ చూసి బస్సులో తన కళ్లు చెమర్చాయని ఎమోషనల్ అయ్యారు.