అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా?.. అయితే ఇలా చేయండి!

30చూసినవారు
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా?.. అయితే ఇలా చేయండి!
AP: రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద మూడో విడత నిధులను విడుదల చేసింది. PM-KISAN కింద కేంద్రం ఇచ్చిన ₹2,000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ₹4,000 జమ చేయడంతో ఒక్కో రైతు ఖాతాలో మొత్తం ₹6,000 చేరాయి. ఈ విడతలో సుమారు 6.85 లక్షల మంది రైతులకు నిధులు అందాయి. అయితే అర్హత ఉండి డబ్బులు జమ కాకపోతే అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో ఆధార్ నంబర్‌తో స్టేటస్ చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. సమస్య ఉంటే రైతు సేవా కేంద్రం, గ్రామ/వార్డు సచివాలయంలో సంప్రదించవచ్చు. అలాగే టోల్ ఫ్రీ నంబర్ 155251కు కాల్ చేసి ఫిర్యాదు చేసే అవకాశమూ ఉంది.