అన్నదాత సుఖీభవ నిధులు విడుదల.. స్టేటస్ చెక్ చేసుకోండిలా..

23చూసినవారు
అన్నదాత సుఖీభవ నిధులు విడుదల.. స్టేటస్ చెక్ చేసుకోండిలా..
AP: అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ రెండో విడత నిధులు శుక్రవారం విడుదల అయ్యాయి. రాష్ట్ర వాటా కింద సుమారు 46.85 లక్షల మంది ఖాతాల్లో రూ.6 వేల చొప్పున రూ.3,125 కోట్లకుపైగా నిధులు జమ అయ్యాయి. అకౌంట్లలోకి డబ్బులు పడ్డాయా? లేదా? అని తెలుసుకోవడానికి ‘అన్నదాత సుఖీభవ’ పోర్టల్‌ను ఓపెన్ చేయాలి. Know Your Status ఆప్షన్‌పై క్లిక్ చేసి.. ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ బటన్‌పై క్లిక్ చేయాలి. స్క్రీన్‌పై మీ వివరాలు కనిపిస్తాయి. ఒకవేళ అకౌంట్‌లో డబ్బులు పడకపోతే, ఆధార్ లింక్, ఈ-కేవైసీ అప్‌డేట్ చేయాలి.

సంబంధిత పోస్ట్