
బడికి వెళ్ళమనందుకు బాలుడు సూసైడ్
బడికి వెళ్ళమనందుకు బాలుడు సూసైడ్ చేసుకున్న ఘటన అనంత జిల్లా రాయదుర్గంలో జరిగింది. కడప జిల్లా పోరుమామిళ్ల మండం అక్కలరెడ్డి పల్లె గ్రామానికి చెందిన ఓ కుటుంబం 15 ఏళ్ల క్రితం నుంచి రాయదుర్గంలో నివసిస్తుంది. వారి కుమారుడు (14) 8వ తరగతి చదువుతున్నాడు. క్రిస్మస్ సెలవులు ముగిసినా కూడా పాఠశాలకు వెళ్లకపోవడంతో ఆదివారం సాయంత్రం తల్లిదండ్రులు సోమవారం నుంచి బడికి వెళ్లాలని చెప్పారు. ఈ క్రమంలో తల్లి ఇంటి బయట పనిలో ఉండగా బాలుడు లోపల ఇంట్లో ఉరివేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.







































