టెకూరుపేటలో ఘనంగా అంగన్‌వాడీ ఉత్సవాలు

1375చూసినవారు
టెకూరుపేటలో ఘనంగా అంగన్‌వాడీ ఉత్సవాలు
పోరుమామిళ్ల మండలం టెకూరుపేటలో అంగన్‌వాడీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బద్వేల్ AMC చైర్‌పర్సన్ నారిశెట్టి సుప్రజ హాజరయ్యారు. కార్యక్రమం పోరుమామిళ్ల అంగన్‌వాడీ సూపర్‌వైజర్ మాధవి అధ్యక్షతన CDPO లక్ష్మి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించారు. ఈ సందర్భంగా టెకూరుపేట సెక్టార్ పరిధిలోని సుమారు 35 మంది అంగన్‌వాడీ టీచర్లను పోరుమామిళ్ల బీజేపీ అధ్యక్షుడు నాగేంద్ర ఘనంగా సన్మానించారు. అలాగే టెకూరుపేట అంగన్‌వాడీ కేంద్రంలోని చిన్నారుల అవసరాల కోసం రూ. 5, 000 ఆర్థిక సహాయాన్ని నాగేంద్ర అందించారు.

సంబంధిత పోస్ట్