స్వచ్ఛతా హి సేవా 2026 కార్యక్రమంలో భాగంగా చెత్త రీసైక్లింగ్‌పై అవగాహన

4చూసినవారు
స్వచ్ఛతా హి సేవా 2026 కార్యక్రమంలో భాగంగా చెత్త రీసైక్లింగ్‌పై అవగాహన
వైఎస్సార్‌ కడప జిల్లా బద్వేల్‌లో స్వచ్ఛతా హి సేవా 2026 కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమీషనర్ యం. కృష్ణ ఆధ్వర్యంలో చెత్త వేరు చేయడం, నిర్వహణ, రీసైక్లింగ్‌పై అవగాహన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో SHG గ్రూప్ సభ్యులు, మెప్మా కుటుంబ సభ్యులకు తడి, పొడి చెత్తను మూలస్థాయిలోనే వేర్వేరుగా సేకరించడం, చెత్తను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం, పునర్వినియోగం (రీసైక్లింగ్) ద్వారా వ్యర్థాలను వనరులుగా మార్చడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. పట్టణ పరిశుభ్రతకు చెత్తను మున్సిపాలిటీ సూచించిన విధంగా వేరు చేసి అందించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్