బ్రహ్మంగారిమఠం మండలంలో యూరియాను అధిక రేట్లకు అమ్ముతున్న ఎరువుల దుకాణాల యజమానులపై చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మండల కార్యదర్శి ప్రభాకర్ బుధవారం డిమాండ్ చేశారు. యూరియా దొరకడం కష్టమవుతున్న సమయంలో, వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల మండలంలో ఎరువుల దుకాణాల యజమానులు బస్తా రూ. 500కు పైగా అమ్ముతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని ఆయన తెలిపారు.