బద్వేల్‌లో ఘనంగా‌లో ఘనంగా భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలు

6చూసినవారు
వైఎస్సార్ కడప జిల్లా, బద్వేల్‌లో డివైఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షుడు ముడియం చిన్ని మాట్లాడుతూ భగత్ సింగ్‌ను యువత ఆదర్శంగా తీసుకోవాలని, విప్లవం అంటే తుపాకీ కాదని, మార్పు కోసం ఆలోచించే ధైర్యమని పేర్కొన్నారు. భగత్ సింగ్ స్వాతంత్ర్య పోరాటంతో పాటు చదువు, ఆలోచన, రాజకీయ చైతన్యానికి ప్రతీక అని తెలిపారు.

సంబంధిత పోస్ట్