ప్రజలకు మున్సిపల్ సేవలను మరింత వేగంగా, సులభంగా, పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో బద్వేల్ పురపాలక సంఘం మరో ప్రజా సేవా కార్యక్రమాన్ని ప్రారంభించింది. మున్సిపల్ కమీషనర్ యం. కృష్ణ ఆధ్వర్యంలో బద్వేల్ పట్టణంలోని గాంధీనగర్ స్వర్ణ వార్డు పరిధిలో మామిడి లక్ష్మీ నరసమ్మ మరణించగా వారి కుమారుడు మామిడి మహేశ్వర్ రెడ్డికి సంబంధిత ప్రక్రియను వేగవంతం చేసి 24 గంటలలోపు మరణ ధ్రువీకరణ పత్రం మంజూరు చేయడం జరిగింది.