వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో మంగళవారం
జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశం జరిగింది. రాజోలు ఎమ్మెల్యే, కడప–రాజంపేట స్థానిక ఎన్నికల కోఆర్డినేటర్ దేవ వరప్రసాద్ స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ కమిటీ సభ్యులు మురళీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో బద్వేల్ మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించారు.