కలసపాడు మండలం కొండపేట గ్రామ ప్రజలకు చెందిన భూములకు వెళ్లే రోడ్డును ఆక్రమించారని ఆర్డీవోకు ఫిర్యాదు అందింది. విచారణ అనంతరం రోడ్డు ఏర్పాటు చేయాలని ఆర్డీవో ఆదేశించారు. అధికారులు రోడ్డు ఏర్పాటు చేస్తుండగా, అదే గ్రామానికి చెందిన వెంకట కృష్ణారెడ్డి అడ్డుకుని, అధికారులపై దౌర్జన్యం చేశారని బాధితులు ఆరోపించారు. అధికారులను లెక్కచేయకుండా వ్యవహరించారని బాధితులు వాపోయారు.