చిట్వేల్ మండలంలో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకం అమలు కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. మండల టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కాకర్ల నాగార్జున నాయుడు, చిట్వేల్, నగిరిపాడు పంచాయతీల్లో పర్యటించి, లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, పేదల సంక్షేమానికి తమ నాయకత్వం నిరంతరం కృషి చేస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.