విశ్రాంత ఉద్యోగుల సంఘం వైస్ ప్రెసిడెంట్ గా రవీంద్రనాథ్ ఎన్నిక - ఘన సన్మానం

713చూసినవారు
విశ్రాంత ఉద్యోగుల సంఘం వైస్ ప్రెసిడెంట్ గా రవీంద్రనాథ్ ఎన్నిక - ఘన సన్మానం
కడప జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన సింగసాని రవీంద్రనాథ్ కు బుధవారం బద్వేలులోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు ఎద్దుల రామసుబ్బారెడ్డి, కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య, కోశాధికారి చెల్లుబోయిన గంగన్న యాదవ్, అసోసియేట్ ప్రెసిడెంట్ గంజికుంట పుల్లయ్య, గౌరవ సలహాదారులు గడి పుల్లం తదితరులు పాల్గొన్నారు. రవీంద్రనాథ్ ను సన్మానించి, ఆయన సేవలను కొనియాడారు.

సంబంధిత పోస్ట్