బద్వేల్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో బస్సుల కొరతతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉదయగిరిలో నిర్వహించే పల్లె పండుగ 3. 0 కార్యక్రమానికి బస్సులను బద్వేల్ ఆర్టీసీ బస్టాండ్ నుంచి 9 బస్సులను ఉదయగిరికి పంపించారు. దీంతో బస్టాండ్లో బస్సుల కోసం ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. సరిపడా బస్సులు లేక గమ్యస్థానాలకు చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి బస్సుల కొరతను తీర్చాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.