పాఠశాలలో నీటి సమస్యకు పరిష్కారం

1384చూసినవారు
పాఠశాలలో నీటి సమస్యకు పరిష్కారం
బద్వేల్ నియోజకవర్గం గోపవరం మండలం చిన్న గోపవరం MPP పాఠశాలలో గత కొన్ని రోజులుగా చెడిపోయిన బోరును MPDO శ్రీధర్, ఎర్రగుంట్ల అగాపే ఫౌండేషన్ సహకారంతో సోమవారం మరమ్మతులు చేయించారు. అగాపే ఫౌండేషన్ అధ్యక్షులు జాన్, విజయ్ కుమార్ దాదాపు 25 వేల రూపాయల విలువైన సామగ్రిని అందించడమే కాకుండా స్వయంగా వచ్చి మరమ్మతులు చేపట్టారు. బోరు బాగు చేయించినందుకు గ్రామస్తులు MPDO శ్రీధర్, అగాపే ఫౌండేషన్ అధ్యక్షులు జాన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్