వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్లోని ఫాతిమా పాఠశాలలో అటవీ శాఖ ఆధ్వర్యంలో వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కార్యక్రమం శనివారం జరిగింది. సుమారు 150 మంది
విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీ నయీమ్ అలీ వన్యప్రాణుల ప్రాముఖ్యత, జీవవైవిధ్య పరిరక్షణ, అడవులు, వన్యప్రాణులను కాపాడాల్సిన బాధ్యత గురించి వివరించారు. వన్యప్రాణులకు సంబంధించిన సమస్యల కోసం 1800-425-5909 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.