అంగన్‌వాడీ సిబ్బంది సేవలను ప్రశంసించిన సూపర్వైజర్

1452చూసినవారు
అంగన్‌వాడీ సిబ్బంది సేవలను ప్రశంసించిన సూపర్వైజర్
వైఎస్సార్‌ కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని బద్వేల్-I అంగన్ వాడీ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని అంగన్ వాడీ ఉత్సవం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ICDS సూపర్వైజర్ జె. సుబ్బలక్ష్మి ఆధ్వర్యంలో అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్‌లను సన్మానించారు. చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, విద్యాభివృద్ధికి అంగన్ వాడీ టీచర్లు అందిస్తున్న సేవలు కీలకమని, అంగన్ వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం అందించడం వంటి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని సూపర్వైజర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్