ప్రజావాణి రోజు ఖాళీగా దర్శనమిచ్చిన తహశీల్దార్ కార్యాలయం

0చూసినవారు
కలసపాడు తహశీల్దార్ కార్యాలయంలో అధికారుల నిర్లక్ష్యం. ఉదయం 10:30 దాటినా కార్యాలయ బల్లలు ఖాళీగా దర్శనమిచ్చాయి. గ్రీవెన్స్ రోజున కూడా రెవెన్యూ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ప్రజలు, రైతులు గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. సమయపాలన పాటించని అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బయోమెట్రిక్ హాజరు ఉన్నా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్