వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ మండలం అనంతరాజుపురం గ్రామపంచాయతీలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎక్సపోజర్ విజిట్ ట్రైనింగ్ మంగళవారం జరిగింది. ఈ శిక్షణలో వైఎస్సార్ కడప జిల్లా Dprc నుంచి వచ్చిన మండల రిసోర్స్ పర్సన్ అధికారులు, బద్వేల్ మండలంలోని 10 గ్రామపంచాయతీల Pdoలు, ప్రతి పంచాయతీ నుంచి ఒక గ్రీన్ అంబాసిడర్ హాజరయ్యారు. బిన్ బ్యాగ్ విధానం, వార్మి కంపోస్ట్ తయారీ, దాని ద్వారా సంపద సృష్టించే పద్ధతులపై శిక్షణ ఇచ్చారు.