వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్‌లో అండర్-14, అండర్-17 బాలబాలికల మండల స్థాయి క్రీడా ఎంపికలు 2026 సెప్టెంబర్ 28న కన్యకా పరమేశ్వరి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగాయి. విద్యాశాఖ అధికారులు, హెడ్‌మాస్టర్, ఉపాధ్యాయుల పర్యవేక్షణలో జరిగిన ఈ ఎంపికలకు వివిధ పాఠశాలల
విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించిన విద్యార్థులను మండల స్థాయి నుంచి నియోజకవర్గ, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని అధికారులు తెలిపారు.